కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీపై మండిపడ్డ టీడీపీ నేత సీఎం రమేశ్!
- చంద్రబాబే ప్యాకేజీకి ఒప్పుకున్నారన్న జైట్లీ
- కేంద్ర మంత్రి వైఖరిని తప్పుపట్టిన టీడీపీ నేత
- హోదాలోని అన్ని ప్రయోజనాలను కేంద్రం ఇస్తామని చెప్పిందని గుర్తుచేసిన నేత
ఈ విషయంలో చంద్రబాబు మాటలను వక్రీకరిస్తూ అరుణ్ జైట్లీ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ పరిస్థితుల్లో చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారో అరుణ్ జైట్లీకి తెలియదా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ ను భర్తీ చేస్తామనీ, అన్నిరకాలుగా ఆదుకుంటామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.