నాగబాబు సమక్షంలో జనసేనలో చేరిన సినీ డైరెక్టర్లు
- ఎన్నికలకు 10 రోజులే సమయం
- ప్రచార జోరును కొనసాగిస్తున్న పార్టీలు
- జనసేన విజయానికి సహకరిస్తామన్న డైరెక్టర్లు
జనసేన నరసాపురం లోక్సభ అభ్యర్థి, సినీ నటుడు నాగబాబు సమక్షంలో సినీ దర్శకులు రమేష్, గోపీ ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, జనసేన విజయానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. టాలీవుడ్ లో తరుణ్, ఓవియా జంటగా తెరకెక్కిన 'ఇది నా లవ్ స్టోరీ' చిత్రానికి రమేష్, గోపీ దర్శకత్వం వహించారు.