మరోసారి నన్ను ఆశీర్వదించండి: ప్రధాని మోదీ
- దేశ ప్రగతి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం
- ఆదాయపన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంచాం
- ఐదేళ్లలో కొత్త పన్నులు విధించలేదు
ఐదేళ్లలో దేశ ప్రగతి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని మోదీ అన్నారు. ప్రజల కోరిక మేరకు ఆదాయపన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచామని, ఐదేళ్లలో కొత్త పన్నులు విధించలేదని, తగ్గిస్తూ వచ్చామని చెప్పారు. పన్నులు వసూలు కాకున్నా అభివృద్ధి పనులు మాత్రం ఆగలేదని అన్నారు. కృష్ణా-గోదావరి నదుల్లో రవాణామార్గం విస్తరణ జరుగుతోందని, ఏపీ సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం అన్ని చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు.