భార్య, కుమారుడితో కలసి వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన అమిత్ షా
- గాంధీనగర్ లో నామినేషన్ వేసిన అమిత్ షా
- వెంట వచ్చిన జైట్లీ, రాజ్ నాథ్, ఉద్ధవ్ థాకరే
- అంతకు ముందు భారీ ర్యాలీ నిర్వహించిన షా
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, వాజ్ పేయి, అద్వానీలాంటి గొప్ప నేతలు ప్రాతినిధ్యం వహించిన గాంధీనగర్ నుంచి పోటీ చేస్తుండటం గర్వంగా ఉందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని తెలిపారు. మోదీ మళ్లీ ప్రధాని కావాలని యావత్ దేశం కోరుకుంటోందని చెప్పారు. గాంధీనగర్ నుంచి అద్వానీ ఆరు సార్లు ఎంపీగా గెలుపొందారు.