చిత్రపరిశ్రమలో నేను ఇమడలేకపోయాను: సీనియర్ నటుడు ప్రదీప్

  • అందువల్లనే గ్యాప్ తీసుకున్నాను
  •  జంధ్యాలగారు నచ్చజెప్పారు 
  • అప్పుడంత మెచ్యూరిటీ లేదు   
తెలుగు తెరకి హీరోగా పరిచయమైన ప్రదీప్ .. ఆ తరువాత 'బుచ్చిబాబు'.. 'పెళ్లిచూపులు' వంటి సీరియల్స్ తో బాగా పాప్యులర్ అయ్యారు. ఎలాంటి సినిమా కష్టాలు పడకుండానే నేరుగా అవకాశం వచ్చి తలుపు తడితే హీరో అయిన ప్రదీప్, ఆ తరువాత కెరియర్ ను పరుగులు తీయించలేకపోయారు. అదే విషయాన్ని గురించి ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ప్రస్తావించారు.

"నా మనస్తత్వానికి .. చిత్రపరిశ్రమలోని వాతావరణానికి పొంతన కుదరలేదు. నేను ముక్కుసూటిగా వెళతాను .. చాలా సెన్సిటివ్ గా వుంటాను. ఎవరైనా ఒక్కమాట అంటే తట్టుకోలేను. ఈ కారణంగానే ఇండస్ట్రీ నుంచి నేను కొంతకాలం పాటు గ్యాప్ తీసుకున్నాను. ఈ విషయంలో నేను ఎవరిదీ తప్పని చెప్పడం లేదు .. అక్కడి పరిస్థితులకు నేను ఇమడలేకపోయాను. జంధ్యాల గారు నాకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా నేను వినిపించుకోలేదు. ఇప్పుడున్న మెచ్యూరిటీ అప్పుడుంటే నేను ఎక్కడో వుండేవాడినని మాత్రం అనిపిస్తూ ఉంటుంది" అని అన్నారు. 
Go Back to Shorts
pradeep
ali

More Telugu News