ప్రియురాలు వేధిస్తోందట... పోలీసుల ముందు ఆత్మహత్యాయత్నం చేసిన హైదరాబాద్ యువకుడు!

26-03-2019 Tue 09:41 | Both States
  • డీఎల్ఎఫ్ లో పని చేస్తున్న ఆదిల్
  • నాలుగేళ్లుగా క్లాస్ మేట్ తో ప్రేమ
  • విషయం ఇంట్లో తెలియడంతో దూషించిన యువతి
  • పోలీస్ స్టేషన్ లో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న ఆదిల్
తానెంతగానో ప్రేమించిన యువతే, తనను వేధిస్తోందని ఆరోపిస్తూ హైదరాబాద్ కు చెందిన యువకుడు, పోలీసుల ముందు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన లంగర్ హౌస్ పరిధిలో కలకలం రేపింది. ఇక్కడి గొల్లబస్తీలో నివాసం ఉంటూ, డీఎల్ఎఫ్ లో పని చేస్తున్న ఆదిల్ (25) అనే యువకుడు, క్లాస్ మేట్ అయిన యువతి (22)ని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు.

ఇంతకాలం సీక్రెట్ గా ఉన్న ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలియడంతో, ఆమె మాట మార్చింది. ఆదిల్ కు ఫోన్ చేసి దూషించింది. పదే పదే ఆమె ఫోన్ చేసి దూషిస్తుండటంతో మనస్తాపం చెందిన ఆదిల్, లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. అమ్మాయిపై ఫిర్యాదు చేస్తూనే, ఒంటికి నిప్పంటించుకున్నాడు. వెంటనే స్పందించిన పోలీసులు మంటలను ఆర్పి, ఆదిల్ ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆదిల్ ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఆదిల్ కు ప్రాణాపాయం ఏమీ లేదని ఉస్మానియా వైద్యులు తెలిపారు.
HyderabadLoverHarrasmentPoliceLanger House

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more