వైఎస్ వివేకాను చంపేస్తే రక్తాన్ని కడగడానికి మాత్రమే అవినాశ్ రెడ్డి పనికొచ్చాడు!: చంద్రబాబు
- కడపకు అవినాశ్ రెడ్డి ఏం పనులు చేశాడో!
- హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులకు ఓటేయొద్దు
- వైసీపీ తోక కట్ చేస్తా, వదిలిపెట్టను
ఈ సందర్భంగా సాక్షి పేపర్, ఛానెల్ పై ఆయన విరుచుకుపడ్డారు. టీడీపీ నాయకుడు రాజశేఖర్ పోటీ నుంచి తప్పుకుంటున్నాడని తప్పుడు వార్తలు రాశారని మండిపడ్డారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే హింస చెలరేగుతుందని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో వయోలెన్స్ చేయాలని చూస్తే మీ తోక కట్ చేస్తా, వదిలిపెట్టను జాగ్రత్త అని వైసీపీ నేతలను హెచ్చరించారు.