సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- రాశిఖన్నా మళ్లీ బిజీ బిజీ
- జూలై నుంచి బాలకృష్ణ సినిమా
- 'ఏబీసీడీ' మరోసారి వాయిదా
- వాల్మీకి షూటింగుకి వరుణ్ తేజ్
* బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందే చిత్రం షూటింగ్ ప్రారంభం మరో నెల ముందుకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగును జూన్ నెలలో ప్రారంభించాలని మొదట్లో అనుకున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం, జూలై నుంచి షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది.
* అల్లు శిరీష్ హీరోగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఏబీసీడీ' చిత్రం విడుదల మరోసారి వాయిదా పడేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఇది పలుసార్లు వాయిదా పడి, ఏప్రిల్ లో రిలీజ్ అవుతుందని చెబుతూ వచ్చారు. అయితే, ఈ వేసవికి ఇక ఈ చిత్రం లేదని తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మే తర్వాత మాత్రమే దీనిని రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట.
* 'ఎఫ్ 2' తరువాత వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం 'వాల్మీకి'. తమిళంలో వచ్చిన 'జిగర్తాండ' చిత్రం ఆధారంగా హరీశ్ శంకర్ రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగులో వరుణ్ వచ్చే నెల 16న జాయిన్ అవుతాడట.