భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన 'కేసరి'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన 'కేసరి'

  • 'కేసరి'గా అక్షయ్ కుమార్ 
  • 'సారాగడి' యుద్ధం నేపథ్యలో కథ
  •  తొలి రోజున అత్యధిక వసూళ్లు
బాలీవుడ్ స్టార్ హీరోలలో అక్షయ్ కుమార్ స్థానం ప్రత్యేకమని చెప్పాలి. విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేయడానికి ఆయన ఎంతమాత్రం వెనుకాడరు. కొత్తదనం కోసం ఆయన పడే ఆరాటమే ఆయనకి వరుస విజయాలను తెచ్చుపెడుతోంది. ఆయన తాజా చిత్రంగా 'కేసరి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా నిన్ననే విడుదలైంది.

విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. తొలి రోజున ఈ సినిమా దేశవ్యాప్తంగా 21 కోట్లను వసూలు చేసింది. ఈ ఏడాది బాలీవుడ్లో తొలిరోజున అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. నిన్న 'హోలీ' సెలవు కావడం ఈ సినిమాకి బాగా కలిసొచ్చిందని అంటున్నారు. 1897లో జరిగిన 'సారాగడి' యుద్ధం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన పరిణీతి చోప్రా నటించింది. అక్షయ్ కుమార్ ఖాతాలో మరో హిట్ పడిపోయినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
akshay kumar
parinithi

More Telugu News