ఇష్టం లేకపోతే ఆయనను చంపేయండి.. దరిద్రం వదిలిపోతుంది: శివాజీ
Add ap7am to your home Screen

ఇష్టం లేకపోతే ఆయనను చంపేయండి.. దరిద్రం వదిలిపోతుంది: శివాజీ

  • మీకు అనుకూలమైన ప్రభుత్వం రావాలనే ఇదంతా చేస్తున్నారు
  • రానున్న 15 రోజులు రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉంటాయి
  • ఏపీకి ఏమీ చేయకపోగా.. కుట్రలకు పాల్పడుతున్నారు
ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లపై హీరో శివాజీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీని నాశనం చేసే దిశగా కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఏపీలో మీకు ఒక నాయకుడు అవసరం లేదు అనుకుంటే... ఆయనను చంపిపడేయాలని... దరిద్రం వదిలిపోతుందని మండిపడ్డారు. మీకు అనుకూలమైన ప్రభుత్వం ఏపీలో రావాలనే ఇదంతా చేస్తున్నారని... అందులో భాగంగా రాష్ట్రంలో భయాందోళనలు సృష్టిస్తున్నారని అన్నారు. రానున్న 15 రోజులు రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉంటాయని తనకు అనిపిస్తోందని చెప్పారు.

రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా, హామీలు నెరవేర్చకుండా... హైదరాబాదు కేంద్రంగా రాజకీయాలను చేస్తున్నారని శివాజీ మండిపడ్డారు. హైదరాబాదులో ఆస్తులు ఉన్నవారిని బెదిరిస్తున్నారని... కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. హైదరాబాదులో ఉన్న ఆస్తులను చట్టపరంగా ఏపీ ప్రభుత్వానికి ఇంతవరకు పంచలేదని దుయ్యబట్టారు. ఏపీకి ఏమీ చేయకపోగా... కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
shivaji
ap
kcr
modi

More Telugu News