బాబాయిని హతమార్చి ఎన్నికలు ఆపేందుకు కుట్ర: జగన్‌పై గోరంట్ల తీవ్ర వ్యాఖ్యలు
- కోడికత్తి ఎపిసోడ్ ఫెయిలైందని కొత్త డ్రామా
- సొంతమీడియాలో వివేకా గుండెపోటుతో మరణించారని చూపించారు
- ఇక్కడి ప్రజల కంటే ఏపీని మోసం చేసిన మోదీ, కేసీఆర్‌లపైనే జగన్‌కు నమ్మకం
వివేకా హత్యపై సీబీఐ దర్యాప్తు కోరుతున్న జగన్ తన సొంత మీడియాలో వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని ఎందుకు చూపించారని ప్రశ్నించారు. వివేకా హత్య జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసిందన్నారు. ఇక్కడి ప్రభుత్వం, పోలీసులతోపాటు ఇక్కడి ప్రజలపైనా జగన్‌కు నమ్మకం లేదన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ, కేసీఆర్‌లపైనే జగన్‌కు ఎక్కువ నమ్మకమని ఎద్దేవా చేశారు. ప్రజలు జగన్‌కు బుద్ధి చెప్పే రోజు అతి దగ్గర్లోనే ఉందని గోరంట్ల హెచ్చరించారు.