విశాఖ వైసీపీలో అసంతృప్తి జ్వాలలు.. బీభత్సం సృష్టించిన వంశీకృష్ణ అనుచరులు!
- విజయనిర్మలకు టికెట్ ఇచ్చిన జగన్
- ఆగ్రహంతో ఊగిపోయిన వంశీ అనుచరులు
- ఎంపీ అభ్యర్థి సత్యనారాయణ ఆఫీసుపై దాడి
విశాఖ వైసీపీ లోక్ సభ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఆఫీసుకు భారీ సంఖ్యలో చేరుకున్న వంశీ అనుచరులు అక్కడి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ‘రావాలి వంశీ-కావాలి వంశీ’ అని నినాదాలు చేశారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో ఇక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
మరోవైపు వంశీకృష్ణతో మాట్లాడేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కాగా, సర్వేలు అనుకూలంగా లేకపోవడంతోనే వంశీకృష్ణకు టికెట్ నిరాకరించినట్లు సమాచారం.