సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు శుభవార్త.. వచ్చే వారం నుంచే అమీర్‌పేట-హైటెక్ సిటీ మార్గంలో మెట్రో కూత

16-03-2019 Sat 08:49 | Telangana
  • రైళ్లు నడిపేందుకు సీఎంఆర్ఎస్ అనుమతి
  • ఇప్పటికే పూర్తయిన ట్రయల్ రన్
  • వేలాదిమందికి ప్రయోజనం
హైటెక్ సిటీ ప్రాంతంలో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త చెప్పింది. అమీర్‌పేట-హైటెక్‌సిటీ మధ్య వచ్చేవారం నుంచి మెట్రో రైలు కూత పెట్టనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ కారిడార్‌లో పనులు గత నవంబరు నాటికే పూర్తి కాగా, తాజాగా రైళ్లు నడిపేందుకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ (సీఎంఆర్ఎస్) అనుమతి ఇచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ మార్గంలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున  ఎటువంటి హడావుడి, ప్రచార ఆర్భాటం లేకుండా రైలు సేవలను ప్రారంభించాలని మెట్రో అధికారులు నిర్ణయించారు. మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో లెక్కకుమించి ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో వేలాదిమంది పనిచేస్తున్నారు. ఇప్పుడీ మెట్రోరైలు మార్గం అందుబాటులోకి రావడంతో వారందరికీ ఎంతో ప్రయోజనం చేకూరనుంది.

ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిత్యం ఎదురయ్యే ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి బయటపడి త్వరగా కార్యాలయాలకు చేరుకునే అవకాశం లభిస్తుంది. అమీర్‌పేట-హైటెక్ సిటీ స్టేషన్ల మధ్య మధురానగర్‌, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌రోడ్‌ నంబర్‌-5, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, పెద్దమ్మగుడి, మాదాపూర్‌, దుర్గంచెరువు, హైటెక్‌సిటీ స్టేషన్‌లుంటాయి.
HyderabadMetro RailCMRSAmeerpetHitech cityTelangana

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more