సహజ మరణానికి, హార్ట్ అటాక్ కు, హత్యకు తేడా తెలియదా మీకు?: వైఎస్ కుటుంబీకులకు సీఎం సూటి ప్రశ్న

15-03-2019 Fri 21:43 | Andhra
  • డాక్టర్ కు గుండెపోటు అని చెప్పారు
  • తలకు గాయమైందని కట్టు కట్టారు
  • ఈ కేసులో అన్నీ అనుమానాలే అంటున్న సీఎం
వైఎస్సార్సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ కేసులో అన్నీ అనుమానాలే కలుగుతున్నాయని అన్నారు. వివేకానందరెడ్డి మరణం వ్యక్తిగతంగా చాలా బాధ కలిగించిందని చెప్పారు చంద్రబాబు. అయితే, ఆయన మరణం ఎంతో అనుమానాస్పదం కావడం పట్ల సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఆధారాలను తారుమారు చేయడానికి జరిగిన ప్రయత్నాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని అన్నారు.

"సాధారణంగా ఎవరైనా చనిపోతే డెడ్ బాడీని కానీ, సంఘటన స్థలాన్ని కానీ డిస్టర్బ్ చేయకూడదు. కానీ వివేకా విషయంలో అలా జరగలేదు. గుండెపోటు అని చెప్పి తలకు గుడ్డకట్టారు. ఈ వ్యవహారంలో స్టెప్ బై స్టెప్ ఆధారాలను తారుమారు చేశారు. సీఐ వచ్చేసరికి రక్తపు మరకలన్నీ శుభ్రం చేశారు. అనుమానాస్పద మృతిగా భావిస్తున్నప్పుడు పంచనామా చేస్తారని మీకు తెలియదా? ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడి డాక్టర్ కు గుండెపోటు అని చెప్పారు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... వివేకా మరణం గురించి అవినాష్ రెడ్డికి ఎలా తెలిసింది? ఎవరు మీ ఇంట్లో హత్య జరిగిన తర్వాత ఇది 5 గంటల ప్రాంతంలో జరిగిందన్నారు?. పీఏ వచ్చేసరికి 5.30 అయింది. 6.40 ప్రాంతంలో అవినాష్ పోలీసులకు ఫోన్ చేశాడు. అవినాష్ రెడ్డి ఫోన్ చేసినప్పుడు ఎవరికి చేశాడు? ఇక, వివేకాను ఆసుపత్రికి తరలించిన తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులందరూ అక్కడికి వెళ్లారు.

మరి హత్య అని మొదటే ఎందుకు చెప్పలేకపోయారు? గుండెపోటు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? సహజమరణానికి, హార్ట్ అటాక్ కు, హత్యకు తేడా తెలియదా మీకు? అంటే, వాళ్ల మధ్యలోనే ఏదో జరిగింది. గుండెపోటు అని పోలీసులను కూడా నమ్మించే ప్రయత్నం చేశారు. లేఖలో ఉన్న విషయాలు కూడా పొంతన లేకుండా ఉన్నాయి. డ్రైవర్ ను త్వరగా రమ్మని పిలిచాను... చంపబోతున్నాడు అని ఉన్నట్టు చెప్పారు. డ్రైవర్ పేరును తీసుకువచ్చారంటే విషయాన్ని తప్పుదారి పట్టిస్తున్నారా?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు సీఎం.

Chandrababu

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more