వివేకా హత్యోదంతం: ఘటనా స్థలంలో దొరికిన లేఖలో ఏమని రాశారో వెల్లడించిన కడప ఎస్పీ

15-03-2019 Fri 21:11 | Andhra
  • అన్నికోణాల్లో దర్యాప్తు
  • లేఖను వివేకా కుటుంబ సభ్యులే అందించారు
  • మీడియాకు వెల్లడించిన రాహుల్ దేవ్ శర్మ
వైఎస్సార్సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి మృతి వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. మొదట గుండెపోటుగా తెరపైకి వచ్చిన ఈ వ్యవహారం పోస్టుమార్టం తర్వాత హత్య అని తేలింది. అంతలోనే, వివేకా రాసినట్టుగా పేర్కొంటున్న ఓ లేఖ తెరపైకి వచ్చింది. దాన్ని తమకు అందించింది వివేకా కుటుంబ సభ్యులేనని చెబుతున్నారు కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. వివేకా హత్య గురించి మీడియాతో మాట్లాడుతూ, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఆ లేఖను పరిశీలించామని, పెన్ తో లెటర్ రాసినట్టు తెలుస్తోందని అన్నారు.

ఆ లేఖపై రక్తపు మరకలు ఉన్నాయని చెప్పిన ఆయన... "డ్రైవర్ ను త్వరగా రమ్మని పిలిచాను... అందుకే నన్ను చంపబోతున్నాడు" అని ఆ లేఖలో ఉందంటూ వెల్లడించారు.. ఈ లేఖపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నాం అంటూ స్పష్టం చేశారు. ఈ లేఖలో డ్రైవర్ పేరును ప్రస్తావించడం కుట్రలో భాగం అని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపించారు. తన చిన్నాన్న మృతి వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించేందుకే డ్రైవర్ పేరును తీసుకువచ్చారని మండిపడ్డారు.  రక్తపు గాయాలతో ఉన్న తన చిన్నాన్న హంతకులు చూస్తుండగా ఆ లేఖను ఎలా రాయగలడని జగన్ ప్రశ్నించారు.
JaganYSRCP

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more