ప్రియమణి 'సిరివెన్నెల' నుంచి ఫస్టులుక్
- ప్రియమణి ప్రధాన పాత్రధారిగా 'సిరివెన్నెల'
- దర్శకుడిగా ప్రకాశ్ పులిజాల
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
ప్రకాశ్ పులిజాల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, చిన్నప్పటి ప్రియమణిగా బేబీ సాయితేజస్వి నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఈ చిన్నారి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. సినిమాపై ఆసక్తిని రేకెత్తించేదిలానే ఈ ఫస్టులుక్ వుంది. 'మహానటి' సినిమాలో చిన్నప్పటి సావిత్రిగా నటించి మంచి మార్కులు కొట్టేసిన ఈ చిన్నారి, ఈ సినిమాలో వైవిధ్యభరితమైన నటనను ప్రదర్శించనుంది. ఈ పాత్ర ఈ చిన్నారికి మరింత గుర్తింపును తీసుకురావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.