తనపై నిషేధాన్ని ఎత్తివేయడంపై స్పందించిన క్రికెటర్ శ్రీశాంత్!
- 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ లో దొరికిన శ్రీశాంత్
- జీవితకాల నిషేధం విధించిన బీసీసీఐ
- సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేరళ క్రికెటర్
మరోవైపు ఈ విషయమై క్రికెటర్ శ్రీశాంత్ స్పందించాడు. తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు సుప్రీంకోర్టు తనకు ఓ లైఫ్ లైన్ ఇచ్చిందని వ్యాఖ్యానించాడు. క్రికెట్ ప్రాక్టీస్ ను తాను ఇప్పటికే ప్రారంభించాననీ, త్వరలోనే భారత జట్టులో చోటు దక్కించుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
90 రోజులు పూర్తయ్యేవరకూ ఆగకుండా ఈ విషయంలో బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఇందుకోసం తాను ఆరేళ్లు ఆగాననీ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. త్వరలో జరిగే స్కాటిష్ లీగ్ తో పాటు క్లబ్ క్రికెట్ ఆడాలనుకుంటున్నట్లు వ్యాఖ్యానించాడు.