చాక్లెట్ ఆశ చూపి బాలికపై యువకుడి అత్యాచారం!

10-03-2019 Sun 12:17 | Telangana
  • హైదరాబాద్ లోని సైదాబాద్ లో ఘటన
  • తొమ్మిదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
  • కేసును దారిమళ్లించేందుకు ప్రయత్నాలు షురూ
కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు దారుణానికి తెగబడ్డాడు. ఇంటి దగ్గర ఆడుకుంటున్న ఓ చిన్నారి(9)పై లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఘటనాస్థలి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపును ప్రారంభించారు. తెలంగాణలోని హైదరాబాద్ లో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, నిందితుడు ఓ రాజకీయ నేత కుమారుడు కావడంతో కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ లోని సైదాబాద్ ప్రాంతం గ్రీన్ పార్క్ కాలనీలో రమావత్‌ శ్రీను నాయక్‌(24) తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షల్లో ఉత్తీర్ణుడైన శ్రీను.. దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం శ్రీను కుటుంబ సభ్యులు ఓ వివాహ వేడుకకు బయలుదేరారు. దీంతో షాపును చూసుకునేందుకు శ్రీను అక్కడే ఉండిపోయాడు. కాగా, అక్కడే షాపు ముందు సోదరుడితో కలిసి ఆడుకుంటున్న బాలిక(9)కు చాక్లెట్ ఆశ చూపాడు.

అనంతరం చాక్లెట్ ఇస్తానని చెప్పి ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లాడు. వెంట వస్తున్న బాలిక సోదరుడిని వెనక్కి పంపాడు. ఈ నేపథ్యంలోఇంటికి వస్తున్న బాలుడిని చెల్లి ఎక్కడ? అని తల్లి అడిగింది. శ్రీను ఇంటిలోకి తీసుకెళ్లాడని చెప్పడంతో ఆమె హుటాహుటిన అక్కడకు బయలుదేరింది. అప్పటికే బాలికపై అత్యాచారానికి పాల్పడిన శ్రీను ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు.

కుమార్తెకు రక్తస్రావం కావడాన్ని గమనించిన తల్లి.. ఆమెను తొలుత ప్రైవేటు ఆసుపత్రికీ, అనంతరం మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, శ్రీను నాయక్ తండ్రి ఓ జాతీయ పార్టీ నాయకుడు కావడంతో ఈ కేసును దారి మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
TelanganaHyderabadsaidabadrape9 year old girl

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more