కార్తీ కొత్త సినిమా నుంచి ఫస్టులుక్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కార్తీ కొత్త సినిమా నుంచి ఫస్టులుక్

  • 'దేవ్' సినిమాతో పరాజయం
  •  తాజా చిత్రంగా 'కైథీ' 
  • దర్శకుడిగా లోకేశ్  
కార్తీ ఇటీవల చేసిన 'దేవ్' సినిమా అటు తమిళంలో .. ఇటు తెలుగులో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈసారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ఒక విభిన్నమైన కథా చిత్రాన్ని చేయడానికి రంగంలోకి దిగాడు. లోకేశ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కి 'కైథీ'(ఖైదీ) అనే టైటిల్ ను ఖరారు చేశారు.

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. రక్తధారలతోనే చెరసాల .. ఆ చెరసాలలో కార్తీ ఉన్నట్టుగా ఫస్టు పోస్టర్ ను వదిలారు. ఈ ఫస్టులుక్ ను పోస్ట్ చేసిన కార్తీ, మంచి నటీనటులతో .. సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేస్తున్నందుకు తనకి చాలా సంతోషంగా ఉందని ట్విట్టర్లో రాసుకొచ్చాడు. ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి. 
karthi

More Telugu News