టీవీ-5 ఛానల్ ను నిషేధిస్తున్నాం.. ఆ ఛానల్ కార్యక్రమాలకు వెళ్లవద్దు!: నేతలకు వైసీపీ ఆదేశం
- ప్రెస్ మీట్లు, కవరేజీలపై కూడా నిషేధం
- అధికారిక ప్రకటన జారీచేసిన వైసీపీ
- టీడీపీకి అనుకూలంగా మారారని ఆగ్రహం
స్వతంత్ర జర్నలిజం ముసుగులో ఎల్లోమీడియాగా మారిన ఛానళ్లను బట్టబయలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఈరోజు ఓ ప్రకటనను విడుదల చేసింది. వైసీపీ ఇప్పటికే ఆంధ్రజ్యోతి ఛానల్, పత్రికపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.