'కాంచన 3' రిలీజ్ డేట్ ఖరారు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'కాంచన 3' రిలీజ్ డేట్ ఖరారు

  • లారెన్స్ హారర్ సినిమాలకి మంచి క్రేజ్
  •  నాయికలుగా ఓవియా .. వేదిక
  •  మే 1వ తేదీన విడుదల  
లారెన్స్ దర్శకత్వంలో .. ఆయన కథానాయకుడిగా వచ్చిన హారర్ సినిమాలు, తమిళ.. తెలుగు భాషల్లో భారీ విజయాలను సాధించాయి. దాంతో ఆయన నుంచి అదే సిరీస్ లో మరో హారర్ థ్రిల్లర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో 'కాంచన 3' కోసం చకచకా కథను పూర్తి చేసేసిన లారెన్స్ రంగంలోకి దిగిపోయాడు. ఓవియా .. వేదిక నాయికలుగా నటించిన ఈ సినిమాను ఆయన చాలా వేగంగా పూర్తి చేశాడు.

 తమిళ .. తెలుగు భాషల్లో ఏప్రిల్ 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఈ సినిమాను మే 1వ తేదీన విడుదల  చేయనున్నారనేది తాజా సమాచారం. 'మహర్షి' సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేయాలనుకున్నప్పుడు 'కాంచన 3'ని 18న  రిలీజ్ చేయాలనుకున్నారు. ఇప్పుడు 'మహర్షి' మే 9కి వెళ్లగా.. 'కాంచన 3' మే 1కి వచ్చింది. మొత్తానికి 'మహర్షి'కి ఓ వారం రోజులముందే ఉంటుందన్న మాట.
lawrence
vedika
oviya

More Telugu News