ఇమ్రాన్ ఖాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వండి: పాకిస్థాన్ నెటిజన్ల డిమాండ్
Add ap7am to your home Screen

ఇమ్రాన్ ఖాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వండి: పాకిస్థాన్ నెటిజన్ల డిమాండ్

  • ఇమ్రాన్ కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటూ పాక్ లో డిమాండ్
  • భారత్ తో ఆయన యుద్ధాన్ని కోరుకోలేదంటున్న నెటిజన్లు
  • శాంతికి ద్వారాలను తెరిచిన గొప్ప నేత అంటూ కితాబు
భారత వాయుసేన పైలట్ అభినందన్ కాసేపట్లో భారత్ భూభాగంలో అడుగుపెట్టనున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఎయిర్ ఫోర్స్ అధికారులు, వేలాది మంది ప్రజలు వాఘా సరిహద్దు వద్దకు చేరుకున్నారు. మరోవైపు, శాంతిని నెలకొల్పేందుకు చేస్తున్న కృషిలో భాగంగా అభినందన్ ను విడుదల చేస్తున్నట్టు నిన్న ఇమ్రాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, అభినందన్ భారత్ లో అడుగుపెడుతున్న తరుణంలో పాక్ సోషల్ మీడియాలో కొత్త వాదన తెరపైకి వచ్చింది. భారత్ తో యుద్ధాన్ని కోరుకోకుండా... శాంతికి ద్వారాలు తెరిచిన గొప్ప నేతగా ఇమ్రాన్ ను పాక్ నెటిజన్లు కీర్తిస్తున్నారు. ఇమ్రాన్ కు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 
imran khan
pakistan
nobel peace prize

More Telugu News