హైదరాబాదులో అడుగుపెడితే తాట తీస్తాం: సానియా మీర్జా భర్తకు వార్నింగ్

  • హమారా పాకిస్థాన్ జిందాబాద్ అంటూ షోయబ్ మాలిక్ ట్వీట్
  • ట్విట్టర్ ద్వారా మండిపడుతున్న హైదరాబాదీలు
  • సానియాను బ్రాండ్ అంబాసడర్ గా తొలగించాలన్న రాజాసింగ్
భారత్ టెన్నిస్ స్టార్ సానియామీర్జా భర్త, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పై హైదరాబాదీలు ట్విట్టర్ ద్వారా విరుచుకుపడుతున్నారు. 'హమారా పాకిస్థాన్ జిందాబాద్' అంటూ షోయబ్ మాలిక్ ట్వీట్ చేయడంతో... నెటిజన్లు అతనిపై మండిపడుతున్నారు. హైదరాబాదులో అడుగు పెట్టవద్దంటూ హెచ్చరిస్తున్నారు. షోయబ్ ట్వీట్ పై సానియా స్పందించాలని మరికొందరు ట్వీట్ చేస్తున్నారు. హైదరాబాదులో అడుగుపెడితే దేహశుద్ధి తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఘాటుగా స్పందించారు. సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన విన్నవించారు. 'దేశం మొత్తం పాకిస్థాన్ కు, పాక్ టెర్రరిస్టులకు, పాక్ ఆర్మీ చర్యలకు వ్యతిరేకంగా ఉంటే... మన బ్రాండ్ అంబాసడర్ భర్త మాత్రం భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఈ వ్యాఖ్యలను ఎంత మాత్రం సహించలేం' అంటూ మండిపడ్డారు. తెలంగాణ బ్రాండ్ అంబాసడర్ గా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ను కానీ, షట్లర్లు సైనా నెహ్వాల్ ను కానీ, పీవీ సింధును కానీ నియమించాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Sania Mirza
shoib malik
pakistan
tweet
raja singh
bjp
kcr

More Telugu News