రోడ్డు పక్కన ఒంటరి మహిళ.. దోపిడీకి ఇదో మార్గం.. ఆట కట్టించిన పోలీసులు!

01-03-2019 Fri 11:30 | Telangana
  • కనిపించేది ఒకరిద్దరే...వెనుక పెద్ద గ్యాంగే ఉంటుంది
  • వాహనం ఆపగానే దోచుకుంటారు
  • ఎదురు తిరిగితే చితక్కొడతారు
అర్ధరాత్రి ప్రయాణం... అదీ ఒంటరిగా. ఆ సమయంలో ఒంటరి మహిళ ఎక్కడైనా రోడ్డు పక్కన వాహనం కోసం ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తే.. మనసు చలించి ఆగారో.. ఇక అంతే! ఈ బలహీనతనే తమ దోపిడీకి సరికొత్త మార్గంగా ఎంచుకుందో ముఠా. మహిళను చూసి వాహనం ఆపిన వారిని నిలువు దోపిడీ చేసి పంపుతోంది. పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే...తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో కొన్ని రోజుల నుంచి అర్ధరాత్రి ఓ దోపిడీ దొంగల ముఠా హల్‌చల్‌ చేస్తోంది.

రోడ్డుపై ఓ మహిళను నిలబెడుతుంది. ద్విచక్ర వాహనం, ఫోర్‌వీలర్స్‌, లారీల్లో వచ్చే వారిని ఆ మహిళ ఆపుతుంది. ఆగిన వాహన చోదకుడు ఆశగా ఎక్కడికి? అని అడిగే లోగానే ఓ పెద్దగ్యాంగ్‌ అక్కడ ప్రత్యక్షమవుతుంది. వాహన చోదకుడి వద్ద డబ్బు, నగలు దోచుకుంటుంది. ఎదురు తిరిగిన వారిని చితక్కొట్టి పంపిస్తుంది.

ఆ విధంగానే గత రాత్రి ఓ లారీ డ్రైవర్‌ని ఆపి అతని వద్ద రూ.10 వేలు లాక్కుంది. డ్రైవర్‌, క్లీనర్‌ను చితక్కొట్టి పంపింది. దీన్ని లారీ వెనుక వస్తున్న ఓ కారు డ్రైవర్‌ దూరం నుంచి గమనించాడు. అందుకే అతన్ని కూడా ఈ ముఠా ఆపడానికి ప్రయత్నించినా ఆపకుండా తప్పించుకుని వెళ్లిపోయాడు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఈ ముఠా గుట్టు రట్టయింది.
Mahabubabad Districtrobers gang

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more