అభినందన్ భార్య ఎయిర్ ఫోర్స్ లో మాజీ స్క్వాడ్రన్ లీడర్

28-02-2019 Thu 19:33 | National
  • స్క్వాడ్రన్ లీడర్ గా పదవీవిరమణ
  • పేరు... తన్వీ మర్వాహా
  • కుటుంబం మొత్తం దేశ సేవలోనే!
భారత్ లోనే కాదు పాకిస్థాన్ లో సైతం ఐఏఎఫ్ పైలెట్ అభినందన్ కు మద్దతు పెరుగుతుండడం ప్రజల దృక్పథంలో వస్తున్న మార్పుకు నిదర్శనం అని చెప్పాలి. అభినందన్ ను విడిచిపెట్టాలంటూ పాకిస్తానీలే అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అత్యంత విచారకర పరిస్థితుల్లో శత్రువు చేత చిక్కినా ఎంతో గుండెనిబ్బరంతో భారతదేశ రహస్యాలను వెల్లడించని వైనం అభినందన్ ను ఒక్కసారిగా హీరోగా మార్చేసింది. నిజంగా దేశభక్తి అనేది అభినందన్ రక్తంలోనే ఉందని చెప్పాలి! ఆయన తండ్రి సింహకుట్టి వర్ధమాన్ ఎయిర్ ఫోర్స్ లోనే ఎయిర్ మార్షల్ వరకు ఎదిగారు. తండ్రి అడుగుజాడల్లోనే అభినందన్ కూడా వాయుసేనలో చేరి వింగ్ కమాండర్ ర్యాంక్ అందుకున్నారు.

ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే... అభినందన్ సతీమణి తన్వీ మర్వాహా కూడా ఎయిర్ ఫోర్స్ లో పైలెట్ గా పనిచేశారు. స్క్వాడ్రన్ లీడర్ ర్యాంక్ వరకు పదోన్నతి పొందిన తన్వీ కొద్దికాలం కిందటే స్వచ్ఛంద పదవీ విరమణ చేసినట్టు సమాచారం. భారతీయ వాయుసేనలో ఆమె హెలికాప్టర్ పైలెట్ గా సేవలందించారు. అభినందన్, తన్వీ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. అభినందన్ ఫ్యామిలీ గత కొంతకాలంగా ఢిల్లీలో నివాసం ఉంటోంది. 2004లో ఎయిర్ ఫోర్స్ లో చేరిన అభినందన్ తన కొలీగ్ నే పెళ్లి చేసుకున్నారు.
IndiaPakistan

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more