ఒక 19 ఏళ్ల కుర్రాడు మానవబాంబుగా ఎందుకు మారాడో అర్థం చేసుకోండి: ఇమ్రాన్ ఖాన్

28-02-2019 Thu 17:25 | International
  • గతంలో కశ్మీరీ నాయకులు భారత్ నుంచి విడిపోవాలని కోరుకోలేదు
  • ఇప్పుడు అందరూ స్వాతంత్ర్యం కావాలని కోరుకుంటున్నారు
  • ఏ తప్పు జరిగినా రెండు దేశాలు నాశనమైపోతాయి
పాకిస్థాన్-భారత్ ల మధ్య పరిస్థితులు విషమించాలని ఇరు దేశాలు కోరుకోవడం లేదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పాక్ పార్లమెంటులో ఆయన ప్రసంగిస్తూ, భారత ప్రజలకు ఒక ప్రశ్నను సంధించారు. 'గత నాలుగేళ్లలో ఏం జరిగింది? కశ్మీర్ లో ఒక ఉద్యమం రూపుదాల్చింది. గతంలో కశ్మీరీ నాయకులు భారత్ నుంచి విడిపోవాలని కోరుకోలేదు. కానీ భారత ప్రభుత్వ క్రూరత్వం వల్ల ఈ రోజు వారంతా స్వాతంత్ర్యం కావాలని కోరుకుంటున్నారు' అని చెప్పారు.

ఒక 19 ఏళ్ల కుర్రాడు మానవబాంబుగా ఎందుకు మారాడో అర్థం చేసుకోవాలని ఇమ్రాన్ అన్నారు. చేసిన పనినే మళ్లీ మళ్లీ చేస్తూ... సరికొత్త ఫలితాన్ని రాబట్టాలనుకోవడమనేది 'ఐన్ స్టీన్ థియరీ ఆఫ్ మ్యాడ్ నెస్' అని చెప్పారు. కశ్మీర్ లో జరుగుతున్న పరిణామాలకు పాకిస్థాన్ ను ఎంతకాలం నిందిస్తారని ప్రశ్నించారు. ఆధారాలు చూపకుండానే చర్యలు తీసుకోవాలని ఎలా అడుగుతారని చెప్పారు. ఆత్మాహుతి దాడులను ఇస్లామిక్ రాడికలిజం అని అంటున్నారని... హిందూమతానికి చెందిన తమిళ టైగర్లు ఇదే విధంగా దాడులు చేసేవారని గుర్తు చేశారు.

ఆత్మాహుతి దాడులకు, మతానికి సంబంధం లేదని ఇమ్రాన్ చెప్పారు. బలహీనతలు, నిరాశ వల్ల కొందరు ఇలాంటి దాడులకు తెగబడతారని అన్నారు. ప్రస్తుత భారత ప్రభుత్వం యుద్ధానికి సైతం సిద్ధమవుతున్న తీరును భారత ప్రజలు అంగీకరించడం లేదని చెప్పారు. గత 17 ఏళ్లుగా పాక్ మీడియా ఏం చేసిందో భారత మీడియా గమనించినట్టైతే... యుద్ధ వాతావరణాన్ని సృష్టించే విధంగా కథనాలను ప్రసారం చేయదని అన్నారు. సమస్యకు యుద్ధం పరిష్కారం కాదని చెప్పారు. ఏ తప్పు జరిగినా రెండు దేశాలు నాశనమైపోతాయని అన్నారు. పరిస్థితి చేయి దాటకుండా చూడాలని సూచించారు. లేనిపక్షంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందని చెప్పారు. 
imran khanPakistanPrime Ministerkashmirwarparliament

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more