Chandrababu: దీనికి మీరు 'స్టిక్కర్' వేయడం కుదరదులే.. అంటూ చంద్రబాబుపై కన్నా విమర్శలు

ఏపీకి మొక్కుబడిగా రైల్వే జోన్ ఇవ్వడం బాధాకరమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. చంద్రబాబును ‘స్టిక్కర్ బాబు’ అంటూ ఓ ట్వీట్ చేశారు.

‘మీరు రాష్ట్ర ఆదాయ వనరులనూ, కేంద్ర నిధులనూ ఇన్నాళ్ళుగా పాలు పిండినట్టు పిండేసి.. రైల్వే జోన్ ద్వారా పిండుకోవడానికి మీకు ఏమీ లేదని ఆక్రోశంతో మాట్లాడుతున్నట్టున్నారు. జోన్ ఏర్పాటు వల్ల వచ్చే ఆదాయం, లాభ నష్టాలను భారత రైల్వే చూసుకుంటుంది. మీరు స్టిక్కర్ వేయడం కుదరదులే’ అని కన్నా సెటైర్లు విసిరారు.


Chandrababu
cm
bjp
kanna

More Telugu News