సాక్షి టీవీ ఛానల్ కు నేను రిపోర్టర్ గా వ్యవహరించడానికి కారణం అదే: రేణు దేశాయ్

28-02-2019 Thu 10:27 | Andhra
  • రైతుల కోసం నేను ఒక టీవీ షో చేస్తున్నాను
  • ఇప్పటి వరకు 200 మంది రైతులను కలిశాను
  • నేను చేస్తున్న పనిని రాజకీయాలతో ముడిపెట్టవద్దు
సినీ నటి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవల కర్నూలు జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పవన్ కూడా అదే జిల్లా పర్యటనలో ఉండటం కూడా విదితమే. ఈ పర్యటన సందర్భంగా రేణు దేశాయ్ సాక్షి టీవీ రిపోర్టర్ అవతారం ఎత్తడం జనాల్లో పలు అనుమానాలను రేకెత్తించింది. పవన్ కు వ్యతిరేకంగా రేణును వైసీపీ రంగంలోకి దించిందనే కథనాలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలన్నింటికీ రేణు సమాధానమిచ్చారు.

రైతుల జీవితాలను, వారి కష్టాలను వెలుగులోకి తెచ్చేందుకే తాను సాక్షి తరపున రిపోర్టర్ గా వ్యవహరించానని రేణు తెలిపారు. రైతులకు సంబంధించిన ఒక టీవీ కార్యక్రమాన్ని తాను చేస్తున్నానని చెప్పారు. రైతుల కోసం తాను చేస్తున్న పనిని రాజకీయాలతో ముడిపెట్టవద్దని విన్నవించారు. ఇప్పటి వరకు తాను 200 మంది రైతులను కలిశానని, వారి జీవితాలు దుర్భరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సహకారం అందించేలా ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందని చెప్పారు. తన వల్ల ఒక్క రైతు జీవితం బాగుపడినా తాను చాలా సంతోషిస్తానని అన్నారు.
renu desaisakshi tvreportertollywoodPawan Kalyanjanasena

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more