మిరేజ్ ఫైటర్ జెట్స్ పాక్ రాడార్లను ఎలా బురిడీ కొట్టించాయంటే..!

27-02-2019 Wed 08:30 | National
  • బలహీనంగా ఉన్న పాకిస్థాన్ రాడార్లు
  • ఎవరూ ఊహించని దారిలో వెళ్లిన ఫైటర్ జెట్స్
  • యుద్ధ విమానాల్లోని జామర్ల వాడకం
పుల్వామా సమీపంలో ఆర్మీ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి జరిగిన తరువాత, భారత్ ఏదో ఒక విధంగా స్పందిస్తుందన్న సంగతి పాకిస్థాన్ కు తెలుసు. అప్రమత్తమై, సరిహద్దుల్లో కాపలాను పెంచింది కూడా. ఇండియా దాడికి దిగితే తిప్పికొట్టాలని సైన్యానికి ఆదేశాలు కూడా జారీ చేసింది.

అయితే, నిన్న తెల్లవారుజామున భారత యుద్ధ విమానాలు సునాయాసంగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోకి చొచ్చుకెళ్లి లక్షిత దాడులు చేసివచ్చాయి. భారత ఫైటర్ జెట్స్ వస్తున్నాయన్న సంగతిని ఆ దేశ రాడార్లు గమమనించలేదు. పాక్ గగనతలంలోకి మన జెట్స్ ఎలా వెళ్లాయి? వీటిని ఎందుకు రాడార్లు చూడలేదు? వంటి విషయాలను పరిశీలిస్తే...

ఎంత పవర్ ఫుల్ రాడార్ అయినా, కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో పీకల్లోతు మునిగివున్న పాక్, పాతకాలపు రాడార్లనే వాడుతోంది. ఇక వీటితో సరిహద్దు మొత్తంపై నిఘా పెట్టే వీలు లేదు. ఇండియా విమాన స్థావరాలు ఎక్కడుంటాయో, ఆ దిక్కుగా వీటిని మోహరిస్తారు. ఇదే సమయంలో ఎక్కువ ఎత్తులో ఉంటే విమానాలను రాడార్లు సులువుగా గుర్తిస్తాయి.

ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని, పాక్ ఊహించని మార్గాల ద్వారా విమానాలను తక్కువ ఎత్తులో తీసుకెళుతూ, భారత సైన్యం దాడులు జరిపింది. ఇదే సమయంలో ఐఏఎఫ్ విమానాల్లో అత్యాధునిక రాడార్ జామర్ల వ్యవస్థ కూడా ఉండటంతో, వాటి సాయంతో పాకిస్థాన్ రాడార్లు పనిచేయకుండా చేసి, ఆ విషయాన్ని పాక్ అధికారులు గుర్తించేలోగా, పని ముగించుకుని వచ్చేసుంటారని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
IndiaPakistanRadarsMirrageFighter Jets

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more