కాల్చి చంపాక తెలిసింది.. అతడి వద్ద ఉన్నది బొమ్మ తుపాకి అని: విమాన హైజాక్ ఉదంతంలో కొత్త కోణం

26-02-2019 Tue 08:02 | International
  • బంగ్లాదేశ్ విమానాన్ని హైజాక్ చేసిన దుండగుడు
  • కాల్చి చంపిన భద్రతా దళాలు
  • భార్యతో గొడవే హైజాక్‌కు కారణమని తేల్చిన అధికారులు
బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని భద్రతా దళాలు కాల్చి చంపిన తర్వాత ప్రాథమిక విచారణలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ప్రయాణికులను బెదిరించేందుకు హైజాకర్ వాడింది బొమ్మ తుపాకీ అని తేలింది. భార్యతో వ్యక్తిగత గొడవల కారణంగానే విమానాన్ని హైజాక్ చేశాడని, అతడి మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని అధికారులు తెలిపారు. అయితే, సమగ్ర విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని, ఇప్పుడే ఓ నిర్ధారణకు రాలేమని పేర్కొన్నారు.

ఆదివారం 148 మంది ప్రయాణికులతో ఢాకా నుంచి దుబాయ్ బయలుదేరిన విమానంలో ఓ వ్యక్తి తుపాకితో బెదిరించి కాక్‌పిట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. తుపాకి చూపిస్తూ తన వద్ద పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయని ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా  ఛత్రోగ్రామ్‌ విమానాశ్రయంలో దించారు. రంగంలోకి దిగిన భద్రతా దళాలు హైజాకర్‌తో మాట్లాడి ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించారు. అనంతరం హైజాకర్‌ను కాల్చి చంపారు.

కాగా, హైజాకర్ ఉపయోగించింది బొమ్మ తుపాకియే అయినా అది విమానంలోకి ఎలా తీసుకురాగలిగాడనే విషయంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి వద్ద ఎటువంటి పేలుడు పదార్థాలు లేవని పోలీసులు నిర్ధారించారు. 
Bangladeshhijackershot deadFlightChittagong

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more