​ ట్విట్టర్ యాజమాన్యానికి క్లాస్ పీకిన కేంద్రం

25-02-2019 Mon 19:40 | National
  • లోక్ సభ ఎన్నికల్లో పక్షపాతం చూపొద్దు
  • సజావుగా సాగేలా సహకరించండి
  • ట్విట్టర్ గ్లోబల్ వీపీతో మాట్లాడిన పార్లమెంటరీ కమిటీ
సామాజిక మాధ్యమం ఎంత శక్తిమంతమో అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత యావత్ ప్రపంచానికి బోధపడింది. అయితే ఫేస్ బుక్ వంటి దిగ్గజ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ నుంచి సమాచారం దుర్వినియోగం అయిందన్న ఆరోపణలు ట్రంప్ విజయాన్ని తక్కువ చేసి చూపాయి.

ఈ నేపథ్యంలో ప్రపంచంలో ఏ మూల ఎన్నికలు జరిగినా సామాజిక మాధ్యమాలపై అనుమానంగా చూస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు. ఇప్పుడు భారత్ కూడా లోక్ సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లకు విస్పష్ట హెచ్చరికలు జారీచేసేందుకు కేంద్రం నడుం బిగించింది. ఇప్పటికే ట్విట్టర్ వైస్ ప్రెసిడెంట్, పబ్లిక్ పాలసీ హెడ్ కొలిన్ క్రోవెల్ ను భారత్ రప్పించిన కేంద్రం ఘాటుగా హెచ్చరించింది.

భారత్ లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయని, ఈ సందర్భంగా ట్విట్టర్ నిష్పక్షపాతంతో, చిత్తశుద్ధితో వ్యవహరించాల్సి ఉంటుందని క్రోవెల్ కు స్పష్టం చేసింది పార్లమెంటరీ కమిటీ. భారత్ లో జరిగే  ఎన్నికల్లో నెట్వర్కింగ్ సంస్థల జోక్యాన్ని ఏమాత్రం సహించబోం అంటూ హెచ్చరించింది. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ అధ్యక్షతన ప్రత్యేకంగా సమావేశమైన పార్లమెంటరీ కమిటీ కొలిన్ క్రోవెల్ ను ఈమేరకు హామీ ఇవ్వాల్సిందిగా కోరింది. ఇప్పటికే కొన్ని ప్రశ్నలకు మౌఖికంగా బదులిచ్చిన ట్విట్టర్ వైస్ ప్రెసిడెంట్ క్రోవెల్ మరికొన్ని ప్రశ్నలకు 10 రోజుల్లో లిఖితపూర్వకంగా జవాబులు ఇవ్వనున్నారు.

ఇక, ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా దిగ్గజాల ప్రతినిధులను మార్చి 6న తమ ముందు హాజరు కావాలంటూ పార్లమెంటరీ కమిటీ కోరింది. కొన్ని దేశాల ఎన్నికలను సోషల్ మీడియా సంస్థలు అక్రమ మార్గాల్లో ప్రభావితం చేస్తున్న సంఘటనల నేపథ్యంలోనే తాము ముందస్తుగా నెట్వర్కింగ్ సైట్ల ప్రతినిధులతో మాట్లాడుతున్నామని అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలిపారు.
TwitterIndia

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more