అత్యంత దయనీయ స్థితిలో హీరోయిన్ విజయలక్ష్మి.. ఆసుపత్రి బిల్లుకు కూడా డబ్బుల్లేవు!

24-02-2019 Sun 21:24 | Both States
  • బెంగళూరులో చికిత్స
  • దాతల సాయం కోసం ఎదురుచూపులు
  • తల్లికి సైతం తీవ్ర అనారోగ్యం
తెలుగులో హనుమాన్ జంక్షన్ సినిమాలో చెల్లెలి పాత్ర పోషించిన విజయలక్ష్మి పరిస్థితి ఇప్పుడు అత్యంత దయనీయంగా ఉంది. హనుమాన్ జంక్షన్ చిత్రంలో విజయలక్ష్మి హీరోలు జగపతిబాబు, అర్జున్ లకు సోదరిగా నటించింది. అందులో ఆమె హీరో వేణుకు జోడీ. కన్నడలో ఆమె నాగమండల, సూర్యవంశ వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 ప్రస్తుతం ఆమె టెలివిజన్ సీరియల్స్ కే పరిమితమైంది. అయితే ఇటీవల విజయలక్ష్మి తల్లి తీవ్ర అనారోగ్యం బారినపడి ఆసుపత్రిపాలైంది. ఉన్న డబ్బంతా తల్లి కోసమే ఖర్చు చేసింది విజయలక్ష్మి. అంతలోనే తాను సైతం అనారోగ్యంపాలైంది. ఆమె హైబీపీతో ఆసుపత్రిలో జాయిన్ అయింది. ఒక దశలో పరిస్థితి విషమంగా మారడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. దాంతో  విజయలక్ష్మి కుటుంబం ఆసుపత్రి బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. ఈ మేరకు విజయలక్ష్మి సోదరి ఉషాదేవి ఓ ప్రకటన చేసింది.

తన తల్లి, సోదరి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, తమ వద్ద ఉన్న డబ్బంతా అయిపోయిందని, ఎవరైనా ముందుకొచ్చి సాయంచేస్తేనే తల్లిని, సోదరిని కాపాడుకోగలనని దీనంగా వేడుకుంది ఉషాదేవి. తమిళంలో సూర్యా సరసన ఫ్రెండ్స్ అనే చిత్రంలో నటించిన విజయలక్ష్మి కొద్దికాలంగా సినిమా అవకాశాలు తగ్గడంతో కన్నడ సీరియల్స్ లో నటిస్తోంది. ఆరోగ్యం సహకరించకపోవడంతో సీరియల్ అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో చేతిలో చిల్లిగవ్వ లేక దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. అయితే ఆమె సోదరి ఉషాదేవి చేసిన ప్రకటనతో కన్నడ ఫిలించాంబర్ స్పందించి ఆర్థికసాయం అందజేసింది. విజయలక్ష్మి త్వరగా కోలుకోవాలని ఫిలించాంబర్ సభ్యులు ఆకాంక్షించారు. ప్రస్తుతం విజయలక్ష్మి బెంగళూరులోని మాల్యా హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది.
Tollywood

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more