కనెక్టింగ్ ట్రైన్ ప్రయాణికులకు శుభవార్త... రైలు మిస్సయితే టికెట్ డబ్బు వాపసు
- ఎటువంటి రద్దు చార్జీలు లేకుండా పూర్తి మొత్తం జమ
- మొదటి రైలు ఆస్యంగా వచ్చే సమయంలో వర్తింపు
- ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి
ఎందుకంటే అక్కడ దిగాక రిజర్వేషన్ చేయించుకోవడం కష్టం. దొరికే అవకాశం తక్కువ కాబట్టి. అయితే ఢిల్లీ వెళ్లాల్సిన రైలు ఆలస్యంగా చేరుకుని, అప్పటికే అమృత్సర్ రైలు వెళ్లిపోతే ప్రయాణికుల పరిస్థితి ఏమిటి? అటువంటి వారి కోసమే ఈ సదుపాయం అని రైల్వేశాఖ ప్రకటించింది. ఏప్రిల్ ఒకటి నుంచి అందుబాటులోకి రానున్న ఈ సదుపాయం ఆన్లైన్ టికెట్లతోపాటు పాసింజర్ రిజర్వేషన్ కౌంటర్లలో తీసుకున్న టికెట్లకు వర్తింపజేయనున్నారు. టెలిస్కోపిక్ లాభం, ఎటువంటి రద్దు చార్జీలు లేకుండా పూర్తి మొత్తం రిఫండ్ చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ సిహెచ్.రాకేష్ తెలిపారు.