కల్తీ మద్యం కాటు: పది నిమిషాలకు ఒకరు చొప్పున 110 మంది మృతి.. అసోంలో ఘోరం

24-02-2019 Sun 07:47 | National
  • కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన తేయాకు కార్మికులు
  • మృతుల సంఖ్య పెరిగే అవకాశం
  • మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా
అసోంలో కల్తీమద్యం కాటుకు ఏకంగా 110 మంది తేయాకు కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆసుపత్రులు ప్రతిధ్వనిస్తున్నాయి. కల్తీ మద్యం తాగిన వారిలో 31 మంది శనివారం సాయంత్రమే ప్రాణాలు కోల్పోగా అప్పటి నుంచి గంటగంటకు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రతి పది నిమిషాలకు ఒకరి ప్రాణం గాల్లో కలిసిపోతూనే ఉంది.

శనివారం సాయంత్రానికి  మృతుల సంఖ్య  110కి చేరుకుంది. మరో 341 మంది వివిధ ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. ఒక్క గోల్‌ఘాట్ జిల్లాలోనే 59 మంది మృతి చెందగా, జోర్‌హాట్ జిల్లాకు చెందిన వారు 45 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రతి పది నిమిషాలకు ఒకరు చొప్పున చనిపోతున్నట్టు స్వయంగా అసోం ఆరోగ్య శాఖ మంత్రి హేమంత్ విశ్వకర్మ చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

కల్తీ మద్యం తాగిన తేయాకు కూలీలందరూ గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఘటనపై ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, అస్వస్థతకు గురైన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

శనివారం సీఎం సోనోవాల్ జోర్‌హాట్ వైద్య కళాశాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ..  ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
AssamHoochGuwahatiLiquorTea workers

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more