సుష్మా స్వరాజ్‌కు అరుదైన గౌరవం.. ఓఐసీ సమావేశానికి గౌరవ అతిథిగా ఆహ్వానం
- ఓఐసి నుంచి భారత విదేశాంగ మంత్రికి ఆహ్వానం తొలిసారి
- ఆరంభ సమావేశంలో ప్రసంగించాలని కోరిన ఓఐసీ
- ఓఐసీ సమావేశానికి ఆహ్వానం పట్ల హర్షం
సుష్మను ఓఐసీ ఆరంభ సమావేశంలో ప్రసంగించాలని యూఏఈ విదేశాంగ శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జావేద్ అల్ నహ్యాన్ కోరినట్టు విదేశాంగ మంత్రిత్వశాఖ నేడు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆహ్వానం ద్వారా యూఏఈతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలతో పాటు.. అంతర్జాతీయంగా ఇరు దేశాల భాగస్వామ్యం పెరుగుతుందని వ్యాఖ్యానించింది. 18.5 కోట్ల ముస్లిం జనాభా ఉన్న భారత్‌ను ఓఐసీ సమావేశానికి ఆహ్వానించడం పట్ల హర్షం వ్యక్తం చేసింది.