మీరు ఏ ఫొటోతో ఓట్లు అడుక్కుంటున్నారో.. ఆ ఫొటోలోని వైయస్ కూడా కాంగ్రెస్ నాయకుడే: ఆనంపై కొలనుకొండ శివాజీ ఫైర్

23-02-2019 Sat 16:49 | Andhra
  • తిన్నింటి వాసాలను లెక్కించడాన్ని ఆనం ఆపేయాలి
  • మోదీ కాళ్ల వద్ద రాష్ట్రాన్ని జగన్ తాకట్టు పెట్టారు
  • వైసీపీ ఓటర్లందరూ కాంగ్రెస్ మద్దతుదారులే
వైసీపీ నాయకుడు ఆనం రామనారాయణరెడ్డిపై పీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ మండిపడ్డారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ఆనంకు పదవి లేనిదే నిద్రపట్టదని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీలో అనేక ఉన్నత పదవులు అనుభవించి, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పారిపోయిన ఆనంకు నైతిక విలువలు లేవని అన్నారు. మొన్నటిదాకా టీడీపీలో ఉన్నారని, ఇప్పుడు వైకాపాలో కొనసాగుతున్నారని,  రేపు ఎక్కడుంటారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. పాలు తాగి తల్లి రొమ్ము గుద్దిన మాదిరి కాంగ్రెస్ పార్టీపైనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని... ఇదే సమయంలో ప్రధాని మోదీ కాళ్ల వద్ద రాష్ట్రాన్ని జగన్ తాకట్టు పెట్టారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల మీద చిత్తశుద్ధి ఉంటే మోదీని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నట్టైతే... ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి ఎందుకు దిగుతామని కొలనుకొండ శివాజీ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా... కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇస్తామని చెప్పారు. వైసీపీ సహా అన్ని పార్టీల అంగీకారంతోనే ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ పార్టీ విభజించిందని అన్నారు. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా బలపడిందని చెప్పారు. వైసీపీ ఓటర్లందరూ కాంగ్రెస్ మద్దతుదారులే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఏ ఫొటోతో మీరు ఓట్లను అడుక్కుంటున్నారో... ఆ ఫొటోలోని వైయస్ రాజశేఖరరెడ్డి కూడా కాంగ్రెస్ వ్యక్తేననే విషయాన్ని గ్రహించాలని చెప్పారు. తిన్నింటి వాసాలను లెక్కించడాన్ని ఆనం ఆపేయాలని సూచించారు.
anamkolanukonda shivajichandrababumodijaganysrcongressTelugudesamysrcpbjp

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more