తమిళ స్టార్ హీరో జోడీగా రష్మిక మందన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తమిళ స్టార్ హీరో జోడీగా రష్మిక మందన

  • యూత్ లో రష్మికకి క్రేజ్ 
  • చేతిలో రెండు తెలుగు సినిమాలు
  • తమిళంలో కార్తి జోడీగా ఛాన్స్  
తెలుగులో 'ఛలో' .. 'గీత గోవిందం' సినిమాలతో రష్మిక భారీ విజయాలను సొంతం చేసుకుంది. ఈ రెండు సినిమాలు యూత్ లో ఆమె క్రేజ్ ను విపరీతంగా పెంచేశాయి. దాంతో తెలుగులో ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో 'డియర్ కామ్రేడ్' చేస్తోన్న ఆమె, నితిన్ జోడీగా 'భీష్మ' చేయనుంది. తెలుగులోనే మరికొన్ని ప్రాజెక్టులను లైన్లో పెట్టే పనిలో వుంది.

ఇదే సమయంలో కోలీవుడ్ కి కూడా ఒక మంచి సినిమాతో పరిచయం కావాలనే ఉద్దేశంతో వెయిట్ చేస్తోంది. త్వరలోనే ఆమె కోరిక నెరవేరనున్నట్టు తెలుస్తోంది. తమిళంలో కార్తి హీరోగా ఒక సినిమా చేయడానికి 'రెమో' దర్శకుడు సన్నాహాలు మొదలెట్టేశాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సాగే ఈ సినిమాలో కథానాయికగా ఆయన రష్మికను తీసుకునే ఉద్దేశంతో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నాడట. కార్తి వంటి స్టార్ హీరో జోడీగా చేసే ఛాన్స్ వస్తే రష్మిక వదులుకోదు గనుక, త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం ఖాయమని చెప్పుకుంటున్నారు. 
karthi
rashmika

More Telugu News