ఉగ్రవాద లింకులున్న దేశాలను సాగనంపండి: ఐసీసీని కోరిన బీసీసీఐ
- మా ఆటగాళ్లకు ముప్పుంది
- పుల్వామా దాడిని చాలా దేశాలు ఖండించాయి
- లేఖలో విజ్ఞప్తి చేసిన బీసీసీఐ సీఈవో
ముఖ్యంగా, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగివున్న దేశాలను ఐసీసీ తక్షణమే తన సభ్య దేశాల జాబితా నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశారు జోహ్రీ. తద్వారా పరోక్షంగా పాకిస్థాన్ పై వ్యాఖ్యలు చేశారు. పుల్వామా దాడి ఘటనను యూకే సహా అనేక దేశాలు తీవ్రంగా ఖండించాయని, భారత్ కు తమ సంఘీభావం ప్రకటించాయని లేఖలో తెలిపారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషించే దేశాలతో సంబంధాలను తెంచుకోవాలంటూ క్రికెట్ ప్రపంచాన్ని కోరుతున్నామని పేర్కొన్నారు.