కశ్మీరీ విద్యార్థులపై దాడులు, బహిష్కరణ.. కేంద్రం సహా 11 రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

22-02-2019 Fri 11:37 | National
  • పుల్వామా ఘటన తర్వాత కశ్మీరీ విద్యార్థులపై దాడులు
  • దాడులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సుప్రీంకోర్టు
  • వివరణ ఇవ్వాలంటూ కేంద్రం సహా 11 రాష్ట్రాలకు నోటీసులు
పుల్వామా ఘటన తర్వాత దేశంలో వివిధ ప్రాంతాల్లో విద్యనభ్యసిస్తున్న కశ్మీరీ విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయి. వారిని బహిష్కరించాలని పలు రాష్ట్రాల్లో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కశ్మీరీ విద్యార్థులపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేయాలంటూ దాఖలైన ఒక పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు... కేంద్ర ప్రభుత్వం సహా 11 రాష్ట్రాలకు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.

కశ్మీరీలతో పాటు ఇతర మైనార్టీలపై జరిగిన దాడులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని 11 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో సహా ఢిల్లీ పోలీస్ చీఫ్ కు సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. తారిక్ అదీబ్ అనే పిటిషనర్ తరపున సుప్రీం సీనియర్ న్యాయవాది ఈ పిటిషన్ వేశారు. విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశం కావడంతో, పిటిషన్ ను వెంటనే విచారించాలని వారు కోరారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎల్ఎన్ రావు, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పిటిషన్ ను విచారించింది.

పుల్వామా ఘటన తర్వాత దేశంలోని వివిధ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న కశ్మీరీ విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ దాడులకు అడ్డుకట్ట వేసే విధంగా అధికారులను ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. మీడియాలో వచ్చిన డజన్ల కొద్దీ రిపోర్టులను పిటిషన్ కు జత చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న కశ్మీరీ విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని చెప్పారు. కశ్మీరీలను, వారి వస్తువులను బహిష్కరించాలంటూ మేఘాలయ గవర్నర్ తథాగథరాయ్ చేసిన వ్యాఖ్యలను కూడా ఉటంకించారు.
kashmiristudentspulwamaattackssupreme court

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more