ముస్తాక్ అలీ ట్రోఫీలో శ్రేయాస్ అయ్యర్ వీరంగం.. సిక్సర్లు, ఫోర్లతో విధ్వంసం
- 55 బంతుల్లో 147 పరుగులు
- సిక్కిం బౌలర్లకు చుక్కలు చూపిన ముంబై యువ బ్యాట్స్మన్
- టీ20ల్లో భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు
శ్రేయాస్ అయ్యర్ విజృంభణతో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. అనంతరం 259 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సిక్కిం 104 పరుగులకే కుప్పకూలి పరాజయం పాలైంది.