'2.ఓ' 100 కోట్లు నష్టం తేవడంతో.. 'భారతీయుడు 2'కి షరతులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'2.ఓ' 100 కోట్లు నష్టం తేవడంతో.. 'భారతీయుడు 2'కి షరతులు!

  • శంకర్ దర్శకత్వంలో వచ్చిన '2.ఓ'
  • అంచనాలు అందుకోలేకపోయిన మూవీ
  • 'భారతీయుడు 2' నిర్మాణంపై ప్రభావం  
శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ .. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన '2.ఓ' .. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. శంకర్ .. రజనీ కాంబినేషన్ పై గల క్రేజ్ తో సినిమాకి వెళ్లిన వాళ్లు పెదవి విరిచారు.

అలా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిన ఈ సినిమా, నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ వారికి 100 కోట్ల నష్టం తెచ్చినట్టు సమాచారం. లెక్కలు చూసుకున్న నిర్మాతలు .. 'భారతీయుడు 2' సినిమా నిర్మాణం విషయంలో శంకర్ కి ఒక షరతు పెట్టారట. 250 కోట్లలోపు ఖర్చుతో ఫస్టుకాపీ చేతిలో పెడతానని అగ్రిమెంట్ చేయమన్నట్టుగా సమాచారం. అయితే ముందు ఈ విషయంలో మొండికేసిన శంకర్, ఆ స్థాయి నిర్మాతలు దొరకడం కష్టమని భావించి అగ్రిమెంట్ చేయడానికి అంగీకరించినట్టుగా కోలీవుడ్లో చెప్పుకుంటున్నారు.
rajani
akshay
shankar

More Telugu News