గోపీచంద్ కి ఫోన్ చేస్తే కాల్ కట్ చేశాడు .. నేరుగా ఇంటికే వెళ్లాను: దర్శకుడు బండి సరోజ్ కుమార్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గోపీచంద్ కి ఫోన్ చేస్తే కాల్ కట్ చేశాడు .. నేరుగా ఇంటికే వెళ్లాను: దర్శకుడు బండి సరోజ్ కుమార్

  • సినిమాలంటే చాలా ఇష్టం 
  • ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను
  • సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను    
బండి సరోజ్ కుమార్ దర్శకుడిగా .. హీరోగా 'సూర్యాస్తమయం' అనే సినిమా రూపొందింది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. "చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం .. అందువలన సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. దర్శకుడిని కావాలనే ఉద్దేశంతో కొంతకాలం క్రితం ఒక షార్ట్ ఫిల్మ్ తీసి హీరోలకి దానిని చూపించే ప్రయత్నాలు మొదలుపెట్టాను.

ఒకసారి నేరుగా గోపీచంద్ కి ఫోన్ చేసి .. 'సార్ నేను ఫలానా .. ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను .. చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది' అన్నాను. ఆయన ఏమీ మాట్లాడకుండా కాల్ కట్ చేశాడు. దాంతో మెసేజ్ లు పెట్టాను .. రిప్లై ఇవ్వలేదు. అడ్రెస్ తెలుసుకుని గోపీచంద్ ఇంటికి వెళ్లాను. వాళ్లమ్మ గారు తలుపు తీస్తే .. 'గోపీచంద్ ఇవ్వమన్నారండి' అనే చెప్పేసి ఆ షార్ట్ ఫిల్మ్ టేప్ ఇచ్చేసి వచ్చాను. అది చూసి ఆయన నాకు కాల్ చేశాడు .. మంచి కథ నా దగ్గర ఉందని చెబితే, అప్పుడు నల్లమలుపు బుజ్జిని కలవమని చెప్పాడు" అని అన్నాడు.
bandi saroj kumar

More Telugu News