జయరాం హత్య కేసులో నిందితులకు మూడు రోజుల కస్టడీ

  • నాంపల్లి కోర్టు ముందు నిందితులు
  • మూడు రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు
  • రేపటి నుంచి నిందితులను ప్రశ్నించనున్న పోలీసులు
ప్రముఖ పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసులో నిందితులను నాంపల్లి కోర్టు ముందు జూబ్లీహిల్స్ పోలీసులు ఈరోజు ప్రవేశపెట్టారు. నిందితులను రెండు వారాల పాటు కస్టడీకి అనుమతించాలని పోలీసులు కోరారు. అయితే, నిందితులను మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకోవచ్చని అనుమతిచ్చింది. నిందితులు రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్ లను పోలీసులు రేపటి నుంచి కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ కేసుకు సంబంధించి కొందరిని ప్రశ్నించామని దర్యాప్తు అధికారి కేఎస్ రావు తెలిపారు. కాగా, కోర్టు ఆదేశాల నేపథ్యంలో నిందితులు ఇద్దరిని చంచల్ గూడ జైలు నుంచి కస్టడీలోకి రేపు తీసుకోనున్నారు. 
Go Back to Shorts
chigurupati
jayaram
nampally court
jubli hills

More Telugu News