ఐదారు రోజుల్లోనే క్యాబినెట్ విస్తరణ... తేల్చేసిన కేసీఆర్!
- ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ
- చర్చకు వచ్చిన విస్తరణ అంశం
- పుట్టినరోజు లోగా విస్తరణ
ఈ సమావేశంలో విస్తరణ అంశం చర్చకు రాగా, తొలిసారిగా స్పందించిన కేసీఆర్, అతి త్వరలోనే ఉంటుందని అన్నారట. ఈ నెల 17వ తేదీన కేసీఆర్ పుట్టినరోజు కాగా, అంతకన్నా ముందే విస్తరణ ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక కేసీఆర్ బర్త్ డే వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.