స్పీకర్ వ్యవస్థను కోడెల దిగజార్చారు: అంబటి రాంబాబు
- చంద్రబాబు మళ్లీ సీఎం కావాలట
- స్పీకర్ చైర్ లో కూర్చొని ఈ వ్యాఖ్యలు చేయకూడదు
- గతంలో ఏ స్పీకర్ కూడా ఇలా వ్యవహరించి ఉండరు
శాసనసభకు, సభాపతికి కొన్ని సంప్రదాయాలు ఉంటాయని, సభాపతి తన చైర్ లో కూర్చున్నంత సేపూ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు. కానీ, ఇంత ఘోరంగా సభా సంప్రదాయాలను మంటగలిపిన స్పీకర్ ఎవరైనా ఉన్నారంటే, అది కోడెలేనని మండిపడ్డారు. వైసీపీలో గెలిచి టీడీపీలో చేరిన సభ్యులపై ఇంత వరకూ ఎటువంటి చర్యలు చేపట్టకపోగా, వారు ప్రసంగిస్తుంటే ఆలకించిన మహానుభావుడు స్పీకర్ కోడెల అని సెటైర్లు విసిరారు.