మమత ప్రతీకార చర్య.. సీబీఐ మాజీ తాత్కాలిక చీఫ్ నాగేశ్వరరావు ఆస్తులపై సోదాలు
- కోల్‌కతా సీపీపై విచారణకు సిద్ధమవుతున్న సీబీఐ
- సీబీఐకి ఝలక్కిచ్చిన మమత బెనర్జీ
- ఆస్తులపై విస్తృత సోదాలు
కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను సీబీఐ విచారించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం ప్రతీకార చర్యగానే భావిస్తున్నారు. మరోవైపు, నాగేశ్వరరావు ఆస్తుల విషయంలో సోదాలు నిర్వహించిన రెండు ప్రాంతాల్లోనూ పోలీసులు భారీగా మోహరించారు. ఈ సోదాల్లో నాగేశ్వరరావు భార్య, కుమార్తె ఆధ్వర్యంలో నడిచే కంపెనీతోపాటు స్టాల్‌లేక్‌లో నాగేశ్వరరావు భార్య సారథ్యంలో నడుస్తున్న ఓ కంపెనీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.