జగన్ ను నమ్మం.. ఆయన తీరుతో వైయస్ ఆత్మ ఘోషిస్తుంటుంది: రఘువీరా
- జగన్ మద్దతిచ్చినా తీసుకోము
- కాంగ్రెస్ కండువా కప్పుకునే వైయస్ కు వైసీపీ కండువా కప్పుతున్నారు
- కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం
ఏపీకి ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెబుతున్నా... జగన్ వారినే పట్టుకుని వేలాడుతున్నారని రఘువీరా ఎద్దేవా చేశారు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పుకునే జగన్... కాంగ్రెస్ కండువా ధరించే తన తండ్రికి వైసీపీ కండువా కప్పుతున్నారని... ఇది చూసి వైయస్ ఆత్మ ఘోషిస్తూ ఉంటుందని అన్నారు. ఈనెల 15వ తేదీ నుంచి ప్రత్యేక హోదా భరోసా యాత్రను ఏపీ వ్యాప్తంగా నిర్వహిస్తామని చెప్పారు.