ఆవు పేడను చోరీ చేసిన ప్రభుత్వ ఉద్యోగి.. అరెస్ట్ చేసి జైలుకు పంపిన పోలీసులు
- రూ. 1.25 లక్షల విలువైన పేడ దొంగతనం
- రాత్రికి రాత్రే మాయం చేసిన సూపర్ వైజర్
- పోలీసులకు ఫిర్యాదు.. నిందితుడి అరెస్ట్
భద్రపరిచిన పేడ అదృశ్యం కావడంతో అవాక్కయిన అధికారులు విచారణ ప్రారంభిస్తే సూపర్ వైజరే దానిని మాయం చేశాడని తేలింది. దీంతో సూపర్ వైజర్‌పై అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దొంగిలించిన పేడలో కొంత భాగాన్ని అమ్మేసి, మిగతా దానిని పిడకలు చేసి అమ్మాలని సూపర్ వైజర్ భావించినట్టు పోలీసుల విచారణలో తేలింది.