ఈ తీర్పు మమతా బెనర్జీ సర్కార్ కు ఎదురుదెబ్బ: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్

05-02-2019 Tue 14:38 | National
  • సీబీఐ విచారణకు రాజీవ్ హాజరు కావాలన్న ‘సుప్రీం’
  • చట్టం ముందు ఎవరూ ఎక్కువ కాదన్నది రుజువైంది
  • ఈ తీర్పును స్వాగతిస్తున్నాం
శారదా చిట్ ఫండ్స్ కుంభకోణం దర్యాప్తు వ్యవహారంలో కోల్ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ సహకరించడం లేదంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తునకు రాజీవ్ కుమార్ హాజరు కావాల్సిందేనని ఆదేశించిన న్యాయస్థానం, ఆయన్ని తక్షణమే అరెస్టు చేయొద్దంటూ ఆదేశాలివ్వడంపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. ఈ తీర్పును తాము స్వాగతిస్తున్నామని, చట్టం ఎవరూ ఎక్కువ కాదని దీని ద్వారా రుజువైందని అన్నారు. ఈ తీర్పు మమతా బెనర్జీ సర్కార్ కు ఎదురుదెబ్బ అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరగాలని, దీన్ని రాజకీయం చేయొద్దని రవిశంకర్ ప్రసాద్ కోరారు.

ఇదిలా ఉండగా, ఈ తీర్పుపై మమతా బెనర్జీ కూడా హర్షం చేశారు. ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పు తమ నైతిక విజయంగా అభివర్ణించారు. అయితే,  ప్రతిపక్ష నేతలతో చర్చల అనంతరం తాము చేస్తున్న ధర్నాను విరమించే విషయమై ఓ నిర్ణయానికి వస్తామని స్పష్టం చేశారు.
cbiwest bengarajiv kumarsupreme courtmamata banerjeecentral ministerravi shankar prasad

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more