పూరీ జగన్నాథ్ కు హీరో రామ్ అరుదైన గిఫ్ట్... 'షిట్' అన్న చార్మి!
Add ap7am to your home Screen

పూరీ జగన్నాథ్ కు హీరో రామ్ అరుదైన గిఫ్ట్... 'షిట్' అన్న చార్మి!

  • పూరి దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్'లో నటిస్తున్న రామ్
  • తన దర్శకుడికి ఖరీదైన కాఫీ ప్యాకెట్ ను పంపిన రామ్
  • 'షిట్ షిట్ షిట్' అని చార్మి కామెంట్
ఎనర్జిటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రామ్, ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, తన దర్శకుడికి రామ్ ఓ బహుమతిని పంపించాడు. దీంతో అదే బహుమతిని తనకెందుకు పంపలేదంటూ చార్మి తన అసంతృప్తిని వ్యక్తం చేసింది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ ప్యాకెట్లలో ఒకటైన 'కోపీ లువాక్'ను పూరీకి పంపించాడు. ఆపై పూరి తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, దీన్ని గురించి గూగుల్ లో వెతికి తెలుసుకోవాలని సూచించాడు. ఈ ట్వీట్ ను చూసిన ఛార్మి, 'షిట్ షిట్ షిట్' అని కామెంట్ చేసింది. ఇక ఇలా 'షిట్' అని ఎందుకన్నదో తెలుసా? 'కోఫీ లువాక్' కాఫీ గింజలను తొలుత ఓ రకమైన పిల్లి చేత మింగిస్తారు. తర్వాత ఆ గింజలు అరిగీ అరగకుండా, మలం ద్వారా బయటకు వస్తాయి. అవి చాలా రుచిగా ఉంటాయని ప్రతీతి. ఆ కాఫీ గింజలు చాలా ఖరీదు. దానిని దృష్టిలో పెట్టుకునే చార్మి 'షిట్' అని కామెంట్ చేసింది మరి!
Ram
Puri Jagannadh
Charmi
Twitter

More Telugu News